![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -840 లో....అసలు ఈ జ్యూస్ ఎందుకు మార్చారు.. ఇది ఇవ్వకుండా అది ఎందుకు ఇచ్చారని కావ్య అనుకుంటుంది. తన ఫ్రెండ్ అయిన ల్యాబ్ టెక్నీషియన్ కి కాల్ చేసి ఆ జ్యూస్ పార్సెల్ పంపిస్తుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి ఇందిరాదేవి వచ్చి మాట్లాడుతుంది. అప్పుడే కావ్యకి ల్యాబ్ టెక్నీషియన్ ఫోన్ చేసి ఆ జ్యూస్ లో అబార్షన్ టాబ్లెట్ కలిపారని చెప్తాడు.
అది విని కావ్య షాక్ అవుతుంది. మరి ఆ జ్యూస్ ఇవ్వకుండా లాస్ట్ మినిట్ లో ఎందుకు చేంజ్ చేసుకున్నాడు. అసలు డాక్టర్ ని కలిస్తే అసలు విషయం తెలుస్తుందని కావ్య అనుకుంటుంది. రేపు రాజ్ ని బయటకు పంపించండి.. అయన ఉంటే నేను అసలు విషయం ఏంటని కనుక్కోవడానికి వీలు ఉండదని ఇందిరాదేవితో కావ్య అంటుంది. దానికి ఇందిరాదేవి సరే అంటుంది. నాకు మోకాళ్ళ నొప్పులకు తైలం తీసుకొని రా అని రాజ్ ని ఇందిరాదేవి బయటకు పంపిస్తుంది. రాహుల్ మారిపోయాడని రాహుల్, రుద్రాణి కలిసి స్వప్నని నమ్మించే ప్రయత్నం చేస్తారు
మరొకవైపు కావ్య హాస్పిటల్ విషయం కళ్యాణ్ కి తెలిసి రాజ్ కి ఫోన్ చేస్తాడు. డాక్టర్ కి రాజ్ ఫోన్ చేసి కావ్యకి నిజం చెప్పకండి అని అంటాడు. చెప్తాను.. ఇప్పటికే లేట్ అయిందని డాక్టర్ చెప్తుంది. నర్సు కావ్యని చూసి రాజ్ కి ఫోన్ చెసి చెప్తుంది. కావ్య డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఆపమని నర్సుకి రాజ్ చెప్తాడు. దాంతో కావ్యని నర్సు లోపలికి వెళ్లకుండా ఆపుతుంది. తరువాయి భాగంలో కళ్యాణ్ ని నిజం చెప్పమని కావ్య అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |